
అండర్–23 క్రికెట్ విజేత కడప జట్టు
అండర్–23 అంతర్ జిల్లాల ఎలైట్ గ్రూపు క్రికెట్ పోటీల్లో కడప జట్టు విజేతగా నిలిచింది. కృష్ణాజిల్లా మూలపాడులో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో ఆదివారం కడప జట్టు విజేతగా నిలిచింది.
కడప స్పోర్ట్స్:
అండర్–23 అంతర్ జిల్లాల ఎలైట్ గ్రూపు క్రికెట్ పోటీల్లో కడప జట్టు విజేతగా నిలిచింది. కృష్ణాజిల్లా మూలపాడులో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో ఆదివారం కడప జట్టు విజేతగా నిలిచింది. తూర్పుగోదావరి జట్టుతో నిర్వహించిన మ్యాచ్లో కడప జట్టు విజేతగా నిలిచింది. తొలతు బ్యాటింగ్‌కు దిగిన తూర్పుగోదావరి జట్టు 128 పరుగులు చేసింది. కడప బౌలర్ భరద్వాజ్ 4 వికెట్లు, రఫీ 2, సుదర్శన్∙3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 255 పరుగులు చేసింది. జట్టులోని హరి 53, నరేన్‌రెడ్డి 45, జయవర్ధన్ 34 పరుగులు చేశారు. దీంతో కడప జట్టు 128 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన తూర్పుగోదావరి జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 182 పరుగులు చేసింది. కడప బౌలర్‌లు నరేన్‌రెడ్డి 5, రఫీ 2, సుదర్శన్ 2 వికెట్లు తీశారు. దీంతో 55 పరుగుల విజయలక్ష్యంతోబరిలోకి దిగిన కడప జట్టు 1 వికెట్ కోల్పోయి 56 పరుగులు చేసి విజయం సాధించింది జట్టులోని జయవర్ధన్ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కడప జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో విజేతలకు ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు. కాగా జిల్లా జట్టు తొలిసారి ఎలైట్ గ్రూపులో విజేతగా నిలవడం పట్ల కడప క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి, కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్వి సంజయ్‌రెడ్డి, సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, ఉమామహేశ్వర్, ఏసీఏ ట్రైనర్ ఆనంద్‌లు అభినందించారు.