జాతర తెచ్చిన తంటా! | The two sides collided. | Sakshi
Sakshi News home page

జాతర తెచ్చిన తంటా!

Jun 2 2017 3:11 AM | Updated on Sep 5 2017 12:34 PM

గంగజాతర కార్యక్రమంలో బళ్లారి డ్రమ్స్‌ కారణంగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి.

–ఇరువర్గాల ఘర్షణ
–తొమ్మిది మందికి గాయాలు


మదనపల్లె సిటీ : గంగజాతర కార్యక్రమంలో బళ్లారి డ్రమ్స్‌ కారణంగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. పట్టణ శివార్లలోని నెమలినగర్‌ వడ్డిపల్లెలో గంగజాతర నిర్వహించారు. ఈ జాతరలో బళ్లారి డ్రమ్స్‌ను ఓ వర్గం ఏర్పాటు చేసింది. అయితే తమ వర్గానికి ఇవ్వలేదంటూ మరో వర్గం ఘర్షణ పడింది. ఆ సమయంలో పెద్దలు రాజీ చేశారు. దీనిపై గురువారం పెద్దలు పంచా యితీ చేస్తుండగా ఒకరిపై మరొకరు ఆరోపణ లు చేసుకుంటూ పరస్పరం కర్రలతో దాడికి పాల్పడ్డారు.

ఓ వర్గానికి చెందిన రెడ్డిశేఖర్‌ (19) , రెడ్డికుమార్‌ (50), రెడ్డి(33), మరో వర్గానికి చెందిన గోపాల్‌(52), సోమశేఖర్‌ (24), చలపతి(23), రామస్వామి(33), రెడ్డిప్రసాద్‌(24), మణి(30) గాయపడ్డా రు. వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వన్‌ టౌన్‌ ఎస్‌ఐ సుకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement