మధిరలో ఒకే రోజు మూడు ఆత్మహత్యా సంఘటనలు చోటుచేసుకున్నాయి.
మధిరలో ఒకే రోజు మూడు ఆత్మహత్యా సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు..మధిర మండలం మాడుపల్లిలో రాజేంద్రకుమార్(27) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధిర పట్టణంలోని నడకవీధిలో జ్యోతిర్మయి(28) అనే మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదు అని సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. మధిర మండలాఫీసు రోడ్డులో రామకృష్ణ(23) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.