శ్రీరాంసాగర్‌కు భారీగా వరద | the heavy flood to Sriransagar | Sakshi
Sakshi News home page

శ్రీరాంసాగర్‌కు భారీగా వరద

Aug 1 2016 8:30 PM | Updated on Oct 17 2018 6:06 PM

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గానూ సుమారు 72 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోగా వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1076.45 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గానూ 42.958 టీఎంసీలకు చేరింది. ఈనెల 3న ప్రాజెక్టు నుంచి లోయర్ మానేరు డ్యామ్, మధ్య మానేరు డ్యామ్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement