హోరెత్తిన ‘నాగిరెడ్డిపేట’ | The blustery, nagireddipeta ' | Sakshi
Sakshi News home page

హోరెత్తిన ‘నాగిరెడ్డిపేట’

Sep 12 2016 9:57 PM | Updated on Oct 16 2018 3:12 PM

హోరెత్తిన ‘నాగిరెడ్డిపేట’ - Sakshi

హోరెత్తిన ‘నాగిరెడ్డిపేట’

నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్‌ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్‌తో ప్రజా ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన మహార్యాలీకి అన్ని గ్రామాల నుంచి ప్రజలు భారీగా

నాగిరెడ్డిపేట:
నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్‌ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్‌తో ప్రజా ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన మహార్యాలీకి అన్ని గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో మండల కేంద్రం జన జాతరను తలపించింది. దీంతో సోమవారం పలు గ్రామాల నుంచి ప్రజలు డప్పువాయిద్యాలతో మండల కేంద్రానికి తరలివచ్చారు. మండలకేంద్రంలోని నీటిపారుదల శాఖ అతిథిగృహం వద్ద వారంతా సమావేశమయ్యారు. ప్రధాన రహదారి మీదుగా తహసీల్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించారు. రైతునాయకుడు బొల్లు నర్సింహారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్‌ జిల్లాలో విలీనంచేస్తే కలిగే ప్రయోజనాల గురించి కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. తహసీల్దార్‌ మంత్రూనాయక్‌ అక్కడికి రాగా, ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ప్రొబేషనరీ ఎస్సై శంకర్‌ ఆందోళనకారులను సముదాయించారు. మాజీ జడ్పీటీసీ జయరాజ్, ఐక్యవేదిక నేతలు విఠల్‌గౌడ్, బాలయ్య, నర్సింహులు, బలరాం, బాబురావు, శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ, రవిగౌడ్, కిష్టయ్య, మురళీ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement