మైనార్టీ తీరని బాలికకు పెళ్లి చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు వివాహాన్ని నిలిపి వేసి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
మైనార్టీ తీరని బాలికకు పెళ్లి చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు వివాహాన్ని నిలిపి వేసి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా భీమిని మండలం జజ్జరవెల్లి గ్రామానికిఇ చెందిన బాలిక(14)కు అదే గ్రామానికి చెందిన యువకుడితో గురువారం పెళ్లి చేస్తున్నారనే.. సమాచారంతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు వివాహాన్ని ఆపేసి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం అక్కడికి చేరకున్న తహశీల్దార్, ఎస్సై బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి వారికి తెలియపరిచారు.