మండలపరిధి తలముడిపిలో సోమవారం జన్మభూమి గ్రామసభను ఆ గ్రామ సర్పంచ్ మద్దిరాల శివశంకర్‌రెడ్డి(కంచంరెడ్డి) బహిష్కరించారు. ప్రభుత్వం కక్షపూరితమైన పాలన సాగిస్తోందని, ఈ గ్రామసభలు ప్రజాసమస్యల పరిష్కరానికో, పథకాలు అందజేసేందుకో నిర్వహించడం లేదని మండిపడ్డారు.
గాలివీడు : మండలపరిధిలో తలముడిపిలో సోమవారం జన్మభూమి గ్రామసభను ఆ గ్రామ సర్పంచ్ మద్దిరాల శివశంకర్‌రెడ్డి(కంచంరెడ్డి) బహిష్కరించారు. ప్రభుత్వం కక్షపూరితమైన పాలన సాగిస్తోందని, ఈ గ్రామసభలు ప్రజాసమస్యల పరిష్కరానికో, పథకాలు అందజేసేందుకో నిర్వహించడం లేదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు కాదని, కేవలం జన్మభూమి కమిటీ సభ్యులే గ్రామసభలు జరపడం దారుణమన్నారు. టీడీపీ గ్రామసభలుగా ప్రభుత్వాధికారులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.