మడకశిరలో కనిష్ట ఉష్ణోగ్రత 10.7 డిగ్రీలు | temperature details | Sakshi
Sakshi News home page

మడకశిరలో కనిష్ట ఉష్ణోగ్రత 10.7 డిగ్రీలు

Feb 5 2017 11:09 PM | Updated on Sep 5 2017 2:58 AM

జిల్లాలో ఓ వైపు చలి, మరోవైపు ఎండలు కొనసాగుతున్నాయి. ఆదివారం మడకశిరలో 10.7 డిగ్రీలు, అగళి 11.1 డిగ్రీలు, తనకల్లు 11.2 డిగ్రీలు, రొద్దం 12.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలితీవ్రత కొనసాగుతోంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో ఓ వైపు చలి, మరోవైపు ఎండలు కొనసాగుతున్నాయి. ఆదివారం మడకశిరలో 10.7 డిగ్రీలు, అగళి 11.1 డిగ్రీలు, తనకల్లు 11.2 డిగ్రీలు, రొద్దం 12.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలితీవ్రత కొనసాగుతోంది. మిగతా మండలాల్లో 13 నుంచి 19 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 12 నుంచి 22 శాతం మధ్య రికార్డు కాగా, గాలులు గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచాయి.

Advertisement
 
Advertisement
Advertisement