వైఎస్సార్సీపీ నేతపై దాడి | tdp followers attack on ysrcp leader | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ నేతపై దాడి

Apr 27 2016 9:45 AM | Updated on Aug 10 2018 8:16 PM

తమ దందాకు అడ్డువస్తున్నాడనే అక్కసుతో వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.

రామకుప్పం: తమ దందాకు అడ్డువస్తున్నాడనే అక్కసుతో వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్ల గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెరియప్ప పొలానికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆయన కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు పరారయ్యారు. అయితే, దాడికి పాల్పడిన వ్యక్తి సెల్‌ఫోన్ స్థానికులకు లభించింది. బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, నిందితుని ఫోన్‌ను కూడా అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement