టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ | tdp and ysrcp activists attack each other and some are injured | Sakshi
Sakshi News home page

టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Nov 1 2016 10:51 AM | Updated on Sep 17 2018 5:10 PM

గుంటూరు జిల్లా కోమటినేనివారిపాళెంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాళెం గ్రామంలో మంగళవారం వేకువజామున తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పది మంది కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘర్షణకు పాత కక్షలే కారణమని చిలకలూరిపేట రూరల్‌ సీఐ శోభన్‌బాబు తెలిపారు.

ఈ ఘర్ణణలో గాయపడిన అంజయ్య, కుమార్, శీను, వీరయ్య, యలమంద, తదితరులను చికిత్స నిమిత్తం నరసరావుపేట, చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కోమటినేనివారిపాళెంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement