పోలీసులపై ఎర్రచందనం కూలీలు దాడి | task force police combing in seshachalam forest | Sakshi
Sakshi News home page

పోలీసులపై ఎర్రచందనం కూలీలు దాడి

Jul 21 2016 7:31 AM | Updated on Sep 17 2018 6:26 PM

తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం కూంబింగ్ నిర్వహించారు.

చిత్తూరు : తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహించారు. పుట్టగడ్డ సమీపంలో వారికి 20 మంది ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దాంతో టాస్క్ఫోర్స్ సిబ్బందిపై వారు రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో కానిస్టేబుల్ దిలీప్కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.

అతడిని రుయా ఆసుపత్రికి తరలించారు. అనంతరం టాస్క్ఫోర్స్ సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో పలువురు ఎర్రచందనం కూలీలు పరారైయ్యారు. వారిని టాస్క్ఫోర్స్ పోలీసులు వెంబడించారు. ఇద్దరు ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement