ముద్దనూరు ఎంపీడీవోపై చర్యలు తీసుకోండి | take action on muddanuru mpdo | Sakshi
Sakshi News home page

ముద్దనూరు ఎంపీడీవోపై చర్యలు తీసుకోండి

Oct 28 2016 12:29 AM | Updated on Sep 4 2017 6:29 PM

ముద్దనూరు మండలంలో ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మేరిని వేధిస్తూ ఆత్మహత్యా యత్నానికి కారకుడైనా ఎంపీడీవోపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటి విజిలెన్సు మానిటరింగ్‌ డివిజన్‌ కమిటీ సభ్యుడు మర్రి ప్రకాశం పేర్కొన్నారు.

జమ్మలమడుగు: ముద్దనూరు మండలంలో ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌గా  పనిచేస్తున్న మేరిని వేధిస్తూ ఆత్మహత్యా యత్నానికి కారకుడైనా ఎంపీడీవోపై   ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటి విజిలెన్సు మానిటరింగ్‌ డివిజన్‌ కమిటీ సభ్యుడు మర్రి ప్రకాశం  పేర్కొన్నారు.గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ మేరీ ఆత్మహత్యయత్నానికి ప్రధానం కారణం  ఎంపీడీవో అని  ఉన్నతాధికారులకు తెలిసినా అతనిని కాపాడే ప్రయత్నంలో దళితురాలైనా మేరీకి  అన్యాయం చేయడం దారుణం అన్నారు. ఈ విషయాన్ని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌సభ్యురాలైన కమలమ్మ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు జీజె సైమన్, వెంకటస్వామి  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement