శివయ్య చెంత స్వైపింగ్ సేవలు | swiping machines in sreekalahasthi temple | Sakshi
Sakshi News home page

శివయ్య చెంత స్వైపింగ్ సేవలు

Dec 25 2016 5:52 PM | Updated on Sep 4 2017 11:35 PM

శ్రీకాళహస్తి దేవస్థానంలో టికెట్ కౌంటర్ల వద్ద బ్యాంకువారు స్వైపింగ్ మిషన్ ఏర్పాటుచేయడంతో భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తి దేవస్థానంలో టికెట్ కౌంటర్ల వద్ద బ్యాంకువారు స్వైపింగ్ మిషన్ ఏర్పాటుచేయడంతో భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేవస్థానానికి రోజుకు 25వేల నుంచి 30వేల మంది భక్తులు వస్తుంటారు. అయితే పెద్దనోట్ల రద్దుతో పలువురు భక్తులు దేవస్థానంలో పూజలు చేయించుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు.

కాగా, బ్యాంక్‌వారు అన్ని టికెట్ కౌంటర్ల వద్ద స్వైపింగ్ యంత్రాలు పెట్టడంతో భక్తులు తమ ఏటీఎం కార్డులు వినియోగించుకుని పూజలు చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement