breaking news
ticket counters
-
రైల్వే కౌంటర్ టికెట్లకూ బీమా కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద నేరుగా కొనుగోలు చేసే టికెట్లకు కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులతో సమానంగా బీమా సదుపాయం కల్పించాలని ఆదేశించింది. ఈ సదుపాయాన్ని అక్టోబర్ 27 నుంచే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. అన్ని రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో విక్రయించే టికెట్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. అమల్లో విఫలమైతే రైల్వే బోర్డుదే బాధ్యత అని హెచ్చరించింది. సాధారణ ప్రజల భద్రత, రైలు ప్రయాణాల సమయంలో జరిగే అవాంఛనీయ ఘటనల నివారణకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? ప్రస్తుతం ఆన్లైన్లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు నామమాత్రపు అదనపు మొత్తాన్ని చెల్లించి ప్రయాణ బీమా పొందే అవకాశం ఉంది. అయితే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు ఇదే తరహా సదుపాయం అందుబాటులో లేకపోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అనేక మంది ప్రయాణికులు ఇప్పటికీ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల నుంచే టికెట్లు కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేసింది. అలాంటి వారికి కూడా ఆన్లైన్ టికెట్ కొనుగోలుదారులతో సమానంగా బీమా రక్షణ కల్పించాల్సిందేనని తెలిపింది.‘ఈ అంశంపై గత విచారణల్లోనే రైల్వే అధికారులకు తగిన వ్యవస్థను రూపొందించేందుకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. అయినప్పటికీ, ఎలాంటి పురోగతి కనిపించలేదు’అని అక్టోబర్ 6న జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైల్వే బోర్డు చైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులందరూ నవంబర్ 16న మధ్యాహ్నం 3 గంటలకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హామీల అమలులో చిత్తశుద్ది చూపకుంటే రైల్వే బోర్డు చైర్మన్, సభ్యులను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. ఇదీ చదవండి: సూపర్ ఎల్‌నినో.. వర్షాలు మాయం!నిధులున్నా నిర్లక్ష్యంరైల్వే భద్రతకు సంబంధించిన లక్ష్యాల కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను సైతం పూర్తిస్థాయిలో వినియోగించలేదని ధర్మాసనం ఎత్తి చూపింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ప్రాథమిక అవసరాలను సైతం తగిన స్థాయిలో అమలు చేయకపోవడం ఆందోళనకరమని ధర్మాసనం పేర్కొంది. ప్రమాద నివారణ చర్యలు, భద్రతా వ్యవస్థల అమలు, నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని రైల్వే శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైల్వే భద్రతా వ్యవస్థకు సంబంధించిన వివరాలను చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ జనక్ కుమార్ గార్గ్ స్వయంగా కోర్టుకు అందజేశారు. అయితే, భద్రతా చర్యల అమలుకు వెచ్చిస్తున్న బడ్జెట్ సమాచారం స్పష్టంగా లేకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
టికెట్ కౌంటర్ల వద్ద శానిటైజర్ల ఏర్పాటు
-
ఇందూరు ‘స్టేషన్’లో ఇక్కట్లు..?
నిజామాబాద్ సిటీ: ‘ఏ గ్రేడ్’ రైల్వేస్టేషన్ స్థాయికి ఎదిగిన నిజామాబాద్ రైల్వేస్టేషన్లో ఇప్పటికి ప్రయాణికుల ఇబ్బందులు తొలగడంలేదు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం 45–50 రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాదిగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే వారి ఇబ్బందులను తీర్చడంలో రైల్వే అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ఇక్కట్లు తీర్చేందుకు, ఏడాది క్రితం రెండో రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. ఈ స్టేషన్‌కు వెనుకాల గల నాందేవ్‌వాడ, హమాల్వాడి, దుబ్బ, సుభాష్‌నగర్, కంఠేశ్వర్ ప్రాంతాల ప్రజలకు ఈ రైల్వేస్టేషన్ ఉపయోగపడుతుందని భావించారు. రెండో రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్ ఏర్పాటు ద్వారా ప్రధాన రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్లపై భారం తగ్గుతుందని సైతం భావించారు. తద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. దీంతో పై ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మొదటి రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు టిక్కెట్ల కోసం పెద్ద సంఖ్యలో క్యూలో ఉండటం, ఆ సమయంలో తాము ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుండటం నిత్యం జరుగుతోంది. అయితే రెండో రైల్వేస్టేషన్లో సిబ్బంది కొరత కారణంగా దాదాపుగా మూసి ఉంచుతున్నారు. గూడ్స్ రైలు వస్తే స్టేషన్ బంద్.. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు గూడ్స్ రైలు వచ్చిందంటే చాలు రెండో రైల్వేస్టేషన్‌కు తాళం పడుతోంది. రెండో రైల్వేస్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బందే గూడ్స్ రైలులో సరుకులు నింపే పనులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఇక్కడకు టిక్కెట్ల కోసం వచ్చేవారికి తిప్పలు తప్పడంలేదు. ప్రధాన స్టేషన్లో టిక్కెట్ల కోసం క్యూలో నిలబడాల్సి వస్తుందని వాపోతున్నారు. నిజామాబాద్ మీదుగా సుదూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ, నాందేడ్ మార్గాలకు ప్యాసింజర్ రైళ్లు నడుస్తుంటాయి. దీంతో సామాన్య ప్రజలు తక్కువ ధరకు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్యాసింజర్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. గతంలో నిజామాబాద్ ప్రధాన రైల్వేస్టేషన్లో టిక్కెట్టు కౌంటర్లు మూడు ఉండగా ఇవి ఏ మాత్రం సరిపోక ప్రైవేట్‌గా టిక్కెట్లు ఇచ్చే మిషన్లు ఏర్పాటు చేశారు. దీంతో కొద్దివరకు సమస్య తీరింది. రైలు నిజామాబాద్ స్టేషన్‌కు చేరుకునే కొద్ది నిమిషాల ముందు ప్రయాణికుల సంఖ్య బాగా ఉండడంతో బుకింగ్ కౌంటర్లన్ని కిటికిటలాడుతుంటాయి. రెండో స్టేషన్లో బుకింగ్ కౌంటర్ పనిచేయక ప్రయాణికుల బాధలు మరింత పెరుగుతున్నాయి. అవగాహన కల్పించకపోవడంతోనే.. నిజామాబాద్ రెండో రైల్వేస్టేషన్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించకనే అది నిరుపయోగంగా మారుతోంది. ప్రధాన స్టేషన్లో బుకింగ్ కౌంటర్ వద్ద రెండో రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్ ఉన్నట్లు ప్రచారం చేయకపోవటం, ప్రజల్లో అవగాహన కల్పించక ప్రజలంతా ప్రధాన రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్నారు. తద్వారా అక్కడ టిక్కెట్ల కోసం ప్రయాణికుల తోపులాట ఆగటంలేదు. రెండో రైల్వేస్టేషన్ నిరంతరం పనిచేసేలా సిబ్బందిని నియమించి, బుకింగ్ కౌంటర్‌పై అవగాహన కల్పిస్తే దుబ్బ, నాందేవ్‌వాడ, హమాల్‌వాడీ, కంఠేశ్వర్, సుభాష్‌నగర్ ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. రైల్వే అధికారులు రెండో రైల్వేస్టేషన్ నిరంతరంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
శివయ్య చెంత స్వైపింగ్ సేవలు
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తి దేవస్థానంలో టికెట్ కౌంటర్ల వద్ద బ్యాంకువారు స్వైపింగ్ మిషన్ ఏర్పాటుచేయడంతో భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేవస్థానానికి రోజుకు 25వేల నుంచి 30వేల మంది భక్తులు వస్తుంటారు. అయితే పెద్దనోట్ల రద్దుతో పలువురు భక్తులు దేవస్థానంలో పూజలు చేయించుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. కాగా, బ్యాంక్‌వారు అన్ని టికెట్ కౌంటర్ల వద్ద స్వైపింగ్ యంత్రాలు పెట్టడంతో భక్తులు తమ ఏటీఎం కార్డులు వినియోగించుకుని పూజలు చేసుకుంటున్నారు.


