
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కు మార్ ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కు మార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్– కొచువెలి ( 07115/07116) ప్రత్యేక రైలు ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో రాత్రి 9 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి రెండో రోజు ఉదయం 3.20కి కొచువెలి చేరుకుం టుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 13, 20, 27 మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 8.15కి కొచువెలి నుంచి బయలుదేరి రెండో రోజు ఉదయం 3.30 గంటలకి నాంపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లకు ప్రత్యేక చార్జీలు వర్తిస్తాయి.
సికింద్రాబాద్– కాకినాడ స్పెషల్ ట్రైన్...
సికింద్రాబాద్–కాకినాడ (07101/07102) ప్రత్యేక రైలు ఈ నెల 31న సాయంత్రం 7.15కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15కి కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 2న సాయంత్రం 6.10కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.