గొల్లపల్లి జలాశయం చూసొద్దాం రండి | summer special of gollapalli jalasayam | Sakshi
Sakshi News home page

గొల్లపల్లి జలాశయం చూసొద్దాం రండి

May 22 2017 12:30 AM | Updated on Sep 5 2017 11:40 AM

గొల్లపల్లి జలాశయం చూసొద్దాం రండి

గొల్లపల్లి జలాశయం చూసొద్దాం రండి

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టి చిరస్థాయిగా నెలకొల్పిన గొల్లపల్లి హంద్రీ-నీవా జలాశయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టి చిరస్థాయిగా నెలకొల్పిన గొల్లపల్లి హంద్రీ-నీవా జలాశయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. వేసవి సెలవుల్లో జిల్లా నుంచే కాక పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. గొల్లపల్లి జలాశయం నుంచి చంద్రగిరి, దుద్దేబండ, గొందిపల్లి మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళితే ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీకైలాశానికి చేరుకోవచ్చు. చుట్టూ ఎతైన కొండల మధ్య పురాతన  శ్రీకైలాశ రామలింగేశ్వరస్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. రెండు కొండల మధ్యలో నిలిపిన పార్వతీపరమేశ్వరులు,

ఆ పక్కనే ఈశ్వరుని జట నుంచి జాలు వారుతున్న గంగను చూడవచ్చు. భీమలింగేశ్వరస్వామి, అక్కమ్మ గార్లు కొలువైన క్షేత్రంగాను ఈ ప్రాంతానికి పేరుంది. అయ్యప్ప స్వామి, శివలింగాలు, కోనేరు ఇక్కడి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. 44వ జాతీయ రహదారిపై జిల్లా కేంద్రం నుంచి వచ్చే ప్రయాణికులు గుట్టూరులో దిగి అక్కడ నుంచి ఆటోల ద్వారా మక్కాజీపల్లి తండా మీదుగా వెంకటగిపాళ్యం, చంద్రగిరి, గొల్లపల్లి మీదుగా జలాశయానికి చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వచ్చే వారు జాతీయ రహదారిపై దుద్దేబండ క్రాస్‌ వద్ద తిరిగితే గొల్లపల్లి రిజర్వాయర్‌కు చేరుకోవచ్చు. శ్రీకైలాసÔ¶ క్షేత్రంలో పర్యాటకులు విడది చేసేందుకు చక్కటి వసతి ఉంది.
- పెనుకొండ రూరల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement