భువనగిరి సబ్జైలు సూపరిండెంటెంట్‌ అదృశ్యం | sub jail superintendent missing | Sakshi
Sakshi News home page

భువనగిరి సబ్జైలు సూపరిండెంటెంట్‌ అదృశ్యం

Published Wed, Sep 14 2016 10:09 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

భువనగిరి సబ్జైలు సూపరిండెంటెంట్‌ అదృశ్యం

భువనగిరి సబ్జైలు సూపరిండెంటెంట్‌ అదృశ్యం

నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైలు సూపరిండెంటెంట్‌ శ్రీనివాస్ అదృశ్యమయ్యారు.

భువనగిరి : నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైలు సూపరిండెంటెంట్ శ్రీనివాస్ మంగళవారం రాత్రి అదృశ్యమయ్యారు. ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి ఆయన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బదిలీ చేశారు. దీనిపై శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెందారు. ఉద్యోగానికి వెళ్తున్నానంటూ ఆయన నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ఆ క్రమంలో శ్రీనివాస్ గదిలో ఆయన రాసిన లేఖను కుటుంబ సభ్యులు గుర్తించారు. తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ వేధింపులు భరించలేకే తాను వెళ్లిపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీనివాస్ అదృశ్యంపై అతడి కుటుంబ సభ్యులు భువనగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement