నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకోకు దిగారు.
కోటగిరిలో ఏబీవీపీ రాస్తారోకో
Jul 22 2016 4:44 PM | Updated on Sep 4 2017 5:51 AM
కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆందోళనకు దిగారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేదల నడ్డివిరుస్తున్నాయని, దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. దీనికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Advertisement
Advertisement