వడ్లమూడిలో విద్యార్థిని ఆత్మహత్య | student suicide in vadlamudi | Sakshi
Sakshi News home page

వడ్లమూడిలో విద్యార్థిని ఆత్మహత్య

Jan 31 2016 10:35 AM | Updated on Nov 9 2018 5:02 PM

వడ్లమూడిలో విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

వడ్లమూడిలో విద్యార్థిని ఆత్మహత్య

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది.

గుంటూరు : గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఓ ప్రైవేట్ యూనివర్సిటీ హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
 
బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న హరిణి ఆదివారం తెల్లవారుజామున కళాశాల హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది. గమనించిన సహాచర విద్యార్ధులు యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 


 

Advertisement
 
Advertisement
Advertisement