breaking news
vadlamudi
-
విజ్ఞాన్‌లో 28న వీసీల సమావేశం
గుంటూరు : దక్షిణ భారతదేశంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల ఉన్నత స్థాయి సమావేశం సెప్టెంబర్ 28, 29వ తేదీన విజ్ఞాన్ యూనివర్సిటీలో జరగనుంది. ఈ మేరకు ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సి తంగరాజ్ వెల్లడించారు. సోమవారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తంగరాజ్ మాట్లాడారు. ఈ సమావేశాలకు విజ్ఞాన్ యూనివర్సిటీని ‘ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్’ (ఏఐయూ) ఎంపిక చేసిందని డాక్టర్ సి.తంగరాజ్ తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు దక్షిణాదిలోని యూనివర్సిటీలకు చెందిన దాదాపు 150 మంది వైస్ చాన్స్లర్లు పాల్గొంటారన్నారు. అలాగే దక్షిణాదిలోని రాష్ట్రాల నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శులు కూడా పాల్గొంటారని చెప్పారు. మన దేశ యువతలో నైపుణ్యం, వ్యాపార ధోరణి పెంచడమే ధ్యేయంగా ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఉన్నత విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, పాఠ్యపుస్తకాల్లో చేపట్టాల్సిన సవరణల గురించి కూడా చర్చిస్తారని తంగరాజ్ తెలిపారు. -
వడ్లమూడిలో విద్యార్థిని ఆత్మహత్య
గుంటూరు : గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఓ ప్రైవేట్ యూనివర్సిటీ హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న హరిణి ఆదివారం తెల్లవారుజామున కళాశాల హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది. గమనించిన సహాచర విద్యార్ధులు యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.