సూర్యలంక బీచ్‌లో విద్యార్థి గల్లంతు | student missing in suryalanka beach | Sakshi
Sakshi News home page

సూర్యలంక బీచ్‌లో విద్యార్థి గల్లంతు

Aug 19 2016 3:30 PM | Updated on Nov 9 2018 4:31 PM

స్నేహితులతో కలిసి సముద్రం స్నానం చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతైన సంఘటన గుంటూరు జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది.

బాపట్ల : స్నేహితులతో కలిసి సముద్రం స్నానం చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతైన సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక బీచ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. తెనాలికి చెందిన తరుణ్‌సాయి పాల టెక్నిక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నలుగురు స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల ధాటికి తరుణ్ గల్లంతయ్యాడు. కళ్లెదుటే స్నేహితుడు మునిగి పోవడంతో మిత్రులంతా కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement