ఒకటో తరగతి విద్యార్థి అదృశ్యం | student missing | Sakshi
Sakshi News home page

ఒకటో తరగతి విద్యార్థి అదృశ్యం

Jul 7 2017 10:44 PM | Updated on Nov 9 2018 4:31 PM

కుమ్మరవాండ్లపల్లిలో ఒకటో తరగతి చదివే శివసాయి అనే ఆరేళ్ల బాలుడు తప్పిపోయినట్లు తండ్రి నాగరాజు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కదిరి అర్బన్‌ : కుమ్మరవాండ్లపల్లిలో ఒకటో తరగతి చదివే శివసాయి అనే ఆరేళ్ల బాలుడు తప్పిపోయినట్లు తండ్రి నాగరాజు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి గ్రామంలోని కాకతీయ ప్రైవేటు పాఠశాలకు వెళ్లిన విద్యార్థి తిరిగి రాలేదని పేర్కొన్నాడు. ఇద్దరు వ్యక్తులు స్కూటీలో వచ్చి శివసాయి వెంట ఉన్న బాలుడిని చాక్లెట్‌ కొనుక్కో అని పంపించారని, ఆ తర్వాత శివసాయిని ఎక్కించుకుని వెళ్లారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా కిడ్నాప్‌ చేశారా.. లేక బాలుడు తప్పిపోయాడా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాలుడి ఆచూకీ లభిస్తే డీఎస్పీ సెల్‌ నంబర్‌ 9440796850, సీఐ నంబర్ 94407 96851, ఎస్‌ఐ నంబర్‌ 9014440424కు ఫోన్‌ చేయాలని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement