నకిరేకల్ చెట్టుపై నుంచి జారి కింద పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ మండం కడపర్తి గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది.
చెట్టుపై నుంచి కిందపడి విద్యార్థి మృతి
Jul 23 2016 7:46 PM | Updated on Nov 9 2018 5:02 PM
నకిరేకల్
చెట్టుపై నుంచి జారి కింద పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ మండం కడపర్తి గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపర్తి గ్రామానికి చెందిన మోగరాల యాదయ్య చిన్న కూమారుడు గణేష్ (17) నకిరేకల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సం చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గ్రామంలోని సెల్ టవర్ సమీపంలో అల్లనేరెడు చెట్టు ఎక్కి పండ్లు తెంపుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిరోడ్డు మీద పడటంతో తలకు బలమైన దెబ్బలు తగిలాయి. వెంటనే చుట్టపక్కల వారు చూసి ఆటోలో నకిరేకల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో యాదయ్య కుటుంబంలో విషాదం అమలుకుంది. స్థానిక సర్పంచ్ దుబ్బాక మంగమ్మయాదగిరి రెడ్డి,ఎంపీటీసీ పల్లేబోయిన అంజమ్మ లు సంతాపం తెలిపారు.
Advertisement
Advertisement