స్టయిఫండ్‌ రూ. 5వేలకు పెంచాలి | stipend increase to rs.5 thousand | Sakshi
Sakshi News home page

స్టయిఫండ్‌ రూ. 5వేలకు పెంచాలి

Oct 29 2016 11:11 PM | Updated on Sep 4 2017 6:41 PM

ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమ శాఖల ద్వారా ఆయా వర్గాలకు చెందిన న్యాయవాదులకు ఇస్తున్న రూ.1000 స్టయిఫండ్‌ను రూ.5 వేలకు పెంచాలని ఎస్‌సీ, ఎస్‌టీ లాయర్స్‌ అసోసియేషన్‌ ఏకగ్రీవంగా తీర్మానించింది.

కర్నూలు(అర్బన్‌): ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమ శాఖల ద్వారా ఆయా వర్గాలకు చెందిన న్యాయవాదులకు ఇస్తున్న రూ.1000 స్టయిఫండ్‌ను రూ.5 వేలకు పెంచాలని ఎస్‌సీ, ఎస్‌టీ లాయర్స్‌ అసోసియేషన్‌ ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం స్థానిక ఎస్‌టీబీసీ కళాశాల హాల్‌లో న్యాయవాది ఎంఏ తిరుపతయ్య అధ్యక్షతన ఎస్‌సీ, ఎస్‌టీ న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ.. ఎస్‌సీ, ఎస్‌టీ న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులను అరికట్టాలన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ లాయర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఎంఏ తిరుపతయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా జే పుల్లన్న, ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా రవిరాజు, కార్యదర్శులుగా బండారు వీరన్న, బంగి శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శులుగా కృష్ణానాయక్, మహేష్, కోశాధికారిగా హెచ్‌ నాగలక్ష్మిని ఎన్నుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement