భీమవరం అర్బన్ : మండలంలోని వెంపలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు బుధవారం ప్రారంభం అయ్యాయి. తొలుత ఈ పోటీలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించారు.
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
Jan 12 2017 12:22 AM | Updated on Sep 5 2017 1:01 AM
భీమవరం అర్బన్ : మండలంలోని వెంపలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు బుధవారం ప్రారంభం అయ్యాయి. తొలుత ఈ పోటీలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించారు. రానున్న కాలంలో జాతీయస్థాయి క్రీడలను నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం కొద్దిసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను అలరించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వీఆర్ దాస్, నిర్వాహకులు కలిదిండి కాశీరాజు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కలిదిండి చిన బంగార్రాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement