బ్యాడ్మింటన్‌లో ‘ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌’ సత్తా | SR&BGNR hava in Batmenten | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌లో ‘ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌’ సత్తా

Sep 27 2016 11:24 PM | Updated on Sep 4 2017 3:14 PM

క్రీడాకారులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌ , పీడీ

క్రీడాకారులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌ , పీడీ

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) స్థాయిలో ఈనెల 23, 24వ తేదీల్లో వరంగల్‌లో జరిగిన మొదటి విడత క్రీడల్లో ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల క్రీడాకారులు బ్యాడ్మింటన్‌ విభాగంలో సత్తా చాటారు.

ఖమ్మం స్పోర్ట్స్: కాకతీయ యూనివర్సిటీ (కేయూ) స్థాయిలో ఈనెల 23, 24వ తేదీల్లో వరంగల్‌లో జరిగిన మొదటి విడత క్రీడల్లో ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల క్రీడాకారులు  బ్యాడ్మింటన్‌ విభాగంలో సత్తా చాటారు. యూనివర్సిటీ టీం చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. ఆడిన  ప్రతి మ్యాచ్‌లోనూ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆదిత్య బాపినిడు, వినయ్‌, ఫణీంద్ర, వరప్రసాద్‌లు జట్టును గెలిపించారు. యూనివర్సిటీ జట్టుకు అదిత్య బాపినిడు, వినయ్‌, ఫణీంద్ర ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యు.వీరభద్రం, పీడీ డాక్టర్‌ పి.రఘునందన్‌ తెలిపారు. వీరు అక్టోబర్‌ 3వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రం మధురై కామరాజ్‌ యూనివర్సిటీ నిర్వహించే సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఆడతారని వివరించారు. సత్తా చాటిన విద్యార్థులను ప్రిన్సిపాల్‌, పీడీ, అధ్యాపకులు అభినందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement