ఎస్వీఐటీలో ఘనంగా స్పోర్ట్స్‌ డే | sports day in svit | Sakshi
Sakshi News home page

ఎస్వీఐటీలో ఘనంగా స్పోర్ట్స్‌ డే

Feb 2 2017 11:46 PM | Updated on Sep 5 2017 2:44 AM

ఎస్వీఐటీలో ఘనంగా స్పోర్ట్స్‌ డే

ఎస్వీఐటీలో ఘనంగా స్పోర్ట్స్‌ డే

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని ఎస్వీఐటీ కళాశాల చైర్మన్‌ సి.సోమశేఖర్‌రెడ్డి అన్నారు.

హంపాపురం (రాప్తాడు) : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని ఎస్వీఐటీ కళాశాల చైర్మన్‌ సి.సోమశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని హంపాపురం సమీపంలోని శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్వీఐటీ) ఇంజినీరింగ్‌ కళాశాల 7వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం కళాశాలలో  స్పోర్ట్స్‌ డే నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. కళాశాల వైస్‌ చైర్మన్‌ సి.చక్రధర్‌రెడ్డి , ప్రిన్సిపాల్‌ టి.సూర్యశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడలు అవసరమన్నారు. 

అనంతరం పోటీల్లో గెలుపోందిన కళాశాల విద్యార్థులకు కళాశాల చైర్మన్‌ సి.సోమశేఖర్‌రెడ్డి బహుమతులను అందేజేశారు. ఈసందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి.  కళాశాల ట్రెజరర్‌ రామసుబ్బమ్మ, సెక్రటరి సౌజన్య, ఏఓ మధుసూదన్‌రెడ్డి, పీడీ శ్రీనివాసులు నాయక్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement