క్రీడా ప్రతిభా అవార్డుల ప్రదానం | Sporting excellence awards | Sakshi
Sakshi News home page

క్రీడా ప్రతిభా అవార్డుల ప్రదానం

Aug 24 2016 11:06 PM | Updated on Mar 21 2019 8:35 PM

క్రీడా ప్రతిభా అవార్డుల ప్రదానం - Sakshi

క్రీడా ప్రతిభా అవార్డుల ప్రదానం

జిల్లాలో 2015–16 విద్యా సంవత్సరంలో పాఠశాల క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరిచిన ఉన్నత పాఠశాలలకు అందజేసే క్రీడాప్రతిభా అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ కె.వి. సత్యనారాయణ, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అతిథులుగా విచ్చేసి సంబంధిత పాఠశాలలకు క్రీడాప్రతిభా అవార్డులను అందజేశారు.

కడప స్పోర్ట్స్‌ :
 జిల్లాలో 2015–16 విద్యా సంవత్సరంలో పాఠశాల క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరిచిన ఉన్నత పాఠశాలలకు అందజేసే క్రీడాప్రతిభా అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ కె.వి. సత్యనారాయణ, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అతిథులుగా విచ్చేసి సంబంధిత పాఠశాలలకు క్రీడాప్రతిభా అవార్డులను అందజేశారు.   ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు విచ్చేసి అవార్డును అందుకున్నారు. కాగా ఉదయం నిర్వహించిన సమావేశంలో ఆర్జేడీ ప్రేమానందం, డీఈఓ బి.ప్రతాప్‌రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులనుద్ధేశించి ప్రసంగించారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని సూచించారు. చక్కటి క్రీడాకారులను తయారుచేయాలని కోరారు.

అనంతరం ప్రతియేటా పాఠశాల క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు దాదాపు 950 జతల క్రీడాదుస్తులను అందజేస్తున్న దాత, అన్నమాచార్య విద్యాసంస్థల చైర్మన్‌ చొప్పా గంగిరెడ్డిని కలెక్టర్‌ చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రామసుబ్బరాజు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కిరణ్, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి సునీల్, రీజినల్‌ స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ మురళీకృష్ణ, అథ్లెటిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నరసరాజు, దాతలు నరసింహ, సుధీర్, భాస్కర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

క్రీడాప్రతిభా అవార్డులు అందుకున్న పాఠశాలలు..
రాయచోటి జోన్‌: ప్రథమ – జిల్లా పరిషత్‌ హైస్కూల్, టి. సుండుపల్లె,   ద్వితీయ – జిల్లా పరిషత్‌ హైస్కూల్, వీరబల్లి    
 బద్వేలు జోన్‌ : ప్రథమ – జిల్లా పరిషత్‌ హైస్కూల్, కవలకుంట్ల,   ద్వితీయ – జిల్లా పరిషత్‌ హైస్కూల్, బ్రాహ్మణపల్లె
రాజంపేట జోన్‌ : ప్రథమ – జిల్లా పరిషత్‌ హైస్కూల్, పొత్తపి,   ద్వితీయ – జిల్లా పరిషత్‌ హైస్కూల్, చిట్వేలి
ప్రొద్దుటూరు జోన్‌ : ప్రథమ – పీ.ఆర్‌. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జమ్మలమడుగు,   ద్వితీయ – జిల్లా పరిషత్‌ హైస్కూల్, దొరసానిపల్లె
పులివెందుల జోన్‌ : ప్రథమ – జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ (బాలుర), వేంపల్లి,   ద్వితీయ – రిషి విద్యానికేతన్, పులివెందుల
మైదుకూరు జోన్‌ : ప్రథమ – జిల్లా పరిషత్‌ హైస్కూల్, దువ్వూరు,  ద్వితీయ – జిల్లా పరిషత్‌ హైస్కూల్, మైదుకూరు
కడప జోన్‌ : ప్రథమ – జిల్లా పరిషత్‌ హైస్కూల్, టక్కోలి,  ద్వితీయ – జిల్లా పరిషత్‌ హైస్కూల్, మంటపంపల్లె
యర్రగుంట్ల జోన్‌ : ప్రథమ : డీఏవీ హైస్కూల్, కలమల,  ద్వితీయ : జిల్లా పరిషత్‌ హైస్కూల్, యర్రగుంట్ల
 సెంట్రల్‌మీట్‌ బాలురు : జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ (బాలురు), యర్రగుంట్ల
సెంట్రల్‌మీట్‌ బాలికలు: జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ (బాలికలు), యర్రగుంట్ల
స్కూల్‌ గేమ్స్‌ : బాలబాలికలు : మున్సిపల్‌ హైస్కూల్‌ (మెయిన్‌), కడప.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement