త్వరలో జిల్లా కేంద్రంగా మారనున్న వనపర్తి పట్టణంలో ఎస్పీ కార్యాలయం, పరేడ్‌గ్రౌండ్ నిర్మాణం కోసం గురువారం ఐజీ కె.శ్రీనివాస్‌రెడ్డి వివిధ ప్రభుత్వ స్థలాలు, భవనాలను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్ కానున్న రాజమహల్‌ను,నాగవరం శివారులోని సర్వే నం.86లో ప్రభుత్వ భూమిని, శ్రీనివాసపురం సమీపంలో సర్వేనం.55లోని ఫారెస్టు భూమిని చూశారు.
ఎస్పీ కార్యాలయం కోసం స్థల పరిశీలన
Sep 2 2016 12:55 AM | Updated on Sep 4 2017 11:52 AM
వనపర్తి : త్వరలో జిల్లా కేంద్రంగా మారనున్న వనపర్తి పట్టణంలో ఎస్పీ కార్యాలయం, పరేడ్‌గ్రౌండ్ నిర్మాణం కోసం గురువారం ఐజీ కె.శ్రీనివాస్‌రెడ్డి వివిధ ప్రభుత్వ స్థలాలు, భవనాలను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్ కానున్న రాజమహల్‌ను,నాగవరం శివారులోని సర్వే నం.86లో ప్రభుత్వ భూమిని, శ్రీనివాసపురం సమీపంలో సర్వేనం.55లోని ఫారెస్టు భూమిని చూశారు.
మరికుంటలో ఉన్న పాలశీతలీకరణ కేంద్రంలో కలెక్టరేట్ భవనం, పక్కనే అటవీ భూమిలో ఎస్పీ కార్యాలయం నిర్మిస్తే బాగుంటుందన్నారు. అనంతరం వనపర్తి పట్టణంలోని మున్సిపల్ భవనం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ, నాగవరం శివారులోని యూత్ ట్రై నింగ్ భవనం పరిశీలించారు. కాగా, తాత్కాలిక ఎస్పీ కార్యాలయం కోసం పీఆర్ గెస్ట్‌హౌస్‌ను ఉపయోగించుకోవచ్చని డీఎస్పీ జోగుల చెన్నయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్‌నాయక్, తహసీల్దార్ పాండు, ఎస్‌ఐలు గాంధీనాయక్, నాగశేఖరరెడ్డి, సర్వేయర్ బాల్యానాయక్, వీఆర్‌ఓలు తిరుపతయ్య, మధుసూదన్, సుధారాణి పాల్గొన్నారు.
Advertisement
Advertisement