మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు | Special actions to women protect | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు

Oct 26 2016 12:02 AM | Updated on Apr 3 2019 8:28 PM

మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు - Sakshi

మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు

మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణగౌడ్ తెలిపారు.

 ఇబ్రహీంపట్నం: మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణగౌడ్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి (పాత జిల్లాలు) ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థినులకు వినోభానగర్‌లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో 5 రోజుల పాటు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇచ్చారు. మంగళవారం ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఆత్మరక్షణకు మహిళలు కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో షీ టీమ్స్, 100 నెంబర్‌కు డయల్ చేయాలని తెలిపారు. ఉస్మానియా  వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ పి.విష్ణుదేవ్, కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, డెరైక్టర్ వంశీకృష్ణ, ఏఓ వెంకట్, సీఐ స్వామి, కరాటే మాస్టర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement