కోరం లేక వాయిదాపడిన 76 స్కూళ్లలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి దశరథరామయ్య ఓ ప్రకటనలో తెలి పారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : కోరం లేక వాయిదాపడిన 76 స్కూళ్లలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి దశరథరామయ్య ఓ ప్రకటనలో తెలి పారు. జిల్లాలో మొత్తం 3866 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా, గతం లో 3855 పాఠశాలలకు ఎన్నికలు జరిగాయి. విద్యార్థుల సంఖ్య ‘0’ ఉన్న కారణంగా తొమ్మిది స్కూళ్లలో ఎన్నికలు జరగలేదు.
మిగిలిన 76 స్కూళ్లలో కోరం లేక వాయిదా పడ్డాయి. ఈ నెల 24న ఓటర్ల తుది జాబితా వెల్లడించాలని, 26న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఎన్నిక నిర్వహణ, 1 గంట నుంచి 2.30 గంటల దాకా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, 2.30 నుంచి 3 గంటల మధ్య చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించాలని పీఓ స్పష్టం చేశారు.