విద్యాకమిటీ ఎన్నికలకు కసరత్తు

AP SMC Elections Will Complete In End Of The Month - Sakshi

నేడు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఎన్నికల నిర్వహణకు అధికారుల సమాయత్తం

టీడీపీ ప్రభుత్వ పాలనలో విద్యాకమిటీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. విద్యాకమిటీలను కూడా తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంది. రెండేళ్ల క్రితం కమిటీలను నియమించినా నిధులు మంజూరు చేయకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు విద్యాకమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించింది. ఈ నెల 23వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): జిల్లాలో 3,456 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి.వీటితో పాటు మున్సిపల్, ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. వీటికి మేనేజమెంట్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్వశిక్ష అభియాన్‌ సంచాలకుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు సోమవారం షెడ్యూల్‌ విడుదల కానుంది. పాఠశాల విద్యాకమిటీ పదవీకాలం రెండేళ్లు. చంద్రబాబు ప్రభుత్వం 2016లో కమిటీలకు ఎన్నికలు నిర్వహించింది. రెండేళ్లకు ఈ కమిటీల పదవీకాలం ముగిసినా ఎన్నికల నిర్వహణపై ఆసక్తి చూపలేదు. దీనికి కారణం రెండేళ్లుగా టీడీపీ ప్రభుత్వం పాఠశాలలకు సక్రమంగా గ్రాంట్‌ విడుదల చేయకపోవడమే అని తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నమైన రీతిలో ఆలోచన చేస్తోంది. రెండేళ్లలో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని కొత్త ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పాఠశాలలకు అవసరమైన గ్రాంట్‌ కూడా ముందే విడుదల చేసింది.

విద్యాకమిటీ ఎన్నికలు ఇలా..
ఒక్కొక్క తరగతి నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకుంటారు. ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు సంబంధించి 15 మందిని ఎన్నుకుంటారు. వీరిలో ఒకరిని విద్యాకమిటీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ప్రతి విద్యాకమిటీలో కూడా 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు తప్పునిÜరిగా ఉండాలి. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులకు ముగ్గురు చొప్పున 21 మందిని ఎన్నుకుంటారు. వీరిలో ఒకరు చైర్మన్‌గా, మరొకరు వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. ఉన్నత పాఠశాలలో తొమ్మిది మందిని సభ్యులుగా ఎన్నుకుంటారు. వీరి నుంచి  ఇద్దరు చొప్పున చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు ఉంటారు. వీరితో పాటు ప్రతి పాఠశాల నుంచి ఆరుగురు ఎక్స్‌ అఫి షియో సభ్యులు ఉంటారు.

కమిటీ విధులు 
మౌలిక వసతులు కల్పించడం
► విద్యార్థులు, ఉపాధ్యాయిల హాజరు పరిశీలన
► డ్రాప్‌ అవుట్స్‌ లేకుండా తగిన చర్యలు తీసుకోవడం
► పాఠశాలకు విడుదలైన నిధులు సక్రమంగా వినియోగించేలా చూడటం

నేడు షెడ్యూల్‌ విడుదల 
విద్యా కమిటీ ఎన్నికలకు సోమవారం ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేస్తుంది. ఈ నెల 16వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభమై 23వ తేదీ లోపల ముగుస్తుంది. ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.              
– కె.మోహన్‌రావు, ఎంఈఓ, ఉదయగిరి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top