రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సిక్కోలు ప్రతిభ | sklm players srtikes | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సిక్కోలు ప్రతిభ

Aug 31 2016 11:08 PM | Updated on Sep 4 2017 11:44 AM

పతకాలు సాధించిన క్రీడాకారులు, తైక్వాండో సంఘ ప్రతినిధులు, కోచ్‌లతో ఎంపీ రామ్మోహన్‌

పతకాలు సాధించిన క్రీడాకారులు, తైక్వాండో సంఘ ప్రతినిధులు, కోచ్‌లతో ఎంపీ రామ్మోహన్‌

విజయనగరం తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు విజయనగరం ఇండోర్‌ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి క్యాడెట్, జూనియర్‌ బాలబాలికల తైక్వాండో చాంపియన్‌షిప్‌ పోటీల్లో సిక్కోలు క్రీడాకారులు సత్తా చూపారు. పతకాల పంట పండించారు. ఐదు బంగారు, రెండు రజత, మరో ఐదు కాంస్య పతకాలు సాధించి శభాష్‌ అనిపించారు.

– ఐదు గోల్డ్‌తో కలిపి మొత్తం12 పతకాలు కైవశం 
 
శ్రీకాకుళం న్యూకాలనీ: విజయనగరం తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు విజయనగరం ఇండోర్‌ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి క్యాడెట్, జూనియర్‌ బాలబాలికల తైక్వాండో చాంపియన్‌షిప్‌ పోటీల్లో సిక్కోలు క్రీడాకారులు సత్తా చూపారు. పతకాల పంట పండించారు. ఐదు బంగారు, రెండు రజత, మరో ఐదు కాంస్య పతకాలు సాధించి శభాష్‌ అనిపించారు. క్రీడాకారులను, కోచ్‌ దుర్గాప్రసాద్, శివకుమార్, దయామయిలను ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు తన కార్యాలయంలో బుధవారం అభినందించారు. కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ శ్రీకాకుళం కార్యదర్శి కొమర భాస్కరరావు, సంయుక్త కార్యదర్శి సత్యప్రసాద్, కోశాధికారి కె.శ్రీనివాసరావు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.
 
పతకాలు సాధించినవారు వీరే..
48 కేజీల విభాగంలో జి.జ్యోతీష్‌రెడ్డి, 51 కేజీల విభాగంలో ఆర్‌.వాసుదేవ్, 46 కేజీల విభాగంలో కౌసల్య మహాపాత్రో, 68 కేజీల విభాగంలో శరీన్, 41 కేజీల విభాగంలో ఎ.భువనేశ్వరి, 55 కేజీల విభాగంలో పి.సేవితలు బంగారు పతకాలు సాధించారు. 68 కేజీల విభాగంలో వై.రమేష్, 46 కేజీల విభాగంలో ఎస్‌.సంగీతలు రజత పతకాలు సాధించారు. ఇక 63 కేజీల విభాగంలో కె.హారిక, 44 కేజీల విభాగంలో ఎస్‌.శివానీ, 33 కేజీల విభాగంలో ఎ.జయశ్రీ, 33 కేజీల విభాగంలో ఎల్‌.తారకేష్, 45 కేజీల విభాగంలో ఆర్‌.కుమార్‌లు కాంస్య పతకాలు సాధించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement