తైక్వాండో పోటీలకు దివ్యజ్యోతి | Divyajyothi got selcected to taekwando compititions | Sakshi
Sakshi News home page

తైక్వాండో పోటీలకు దివ్యజ్యోతి

Sep 24 2016 7:58 PM | Updated on Nov 9 2018 5:02 PM

తైక్వాండో పోటీలకు దివ్యజ్యోతి - Sakshi

తైక్వాండో పోటీలకు దివ్యజ్యోతి

రాష్ట్ర స్థాయి తైక్వాండో, జాతీయ స్థాయి టాంగ్‌ సూడో పోటీలకు పట్టణ ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు.

తెనాలి రూరల్‌ : రాష్ట్ర స్థాయి తైక్వాండో, జాతీయ స్థాయి టాంగ్‌ సూడో పోటీలకు పట్టణ ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన గుంటూరులో జరిగిన సెలక్షన్స్‌లో కళాశాలకు చెందిన యు.దివ్యలక్ష్మి తైక్వాండోలో అండర్‌ 19, 58 కిలోల విభాగంలో అర్హత సాధించింది. అలాగే గోవాలో అక్టోబర్‌ 24 నుంచి 26 వరకు జరుగనున్న టాంగ్‌సూడో జాతీయ పోటీలకు  సుంకర అలేఖ్య అర్హత పొందింది. విద్యార్థినులు,  కోచ్‌ కె.శ్రీనివాసరావును శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీన్‌ ఉమామహేశ్వరరావు, రాంబాబు, శివన్నారాయణ, సురేష్‌ తదితర అధ్యాపకులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement