జైలు నుంచి విడుదలైన సిరిసిల్ల రాజయ్య | Sircilla Rajaiah and family released on bail | Sakshi
Sakshi News home page

జైలు నుంచి విడుదలైన సిరిసిల్ల రాజయ్య

Feb 5 2016 8:13 PM | Updated on Nov 6 2018 4:04 PM

కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, భార్య, కుమారుడు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు.

వరంగల్ : కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, భార్య, కుమారుడు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉండి 90 రోజులు గడిచినందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

రూ. 25 వేల చొప్పున ఇద్దరు జమానతుదారుల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన కోర్టు.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటలలోపు సుబేదారి పోలీసుస్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని ఆదేశించింది. అలాగే ఈ నెల 15 లోపు  ముగ్గురు నిందితులకు ఎలాంటి పాస్ పోర్టులు ఉన్నా కోర్టుకు అందజేయాలని షరతు విధించింది. కాగా నాల్గవ నిందితురాలు అయిన సనా ఇప్పటి వరకు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement