సంప్రదాయాలను కాపాడుకుందాం | should save culture and traditions | Sakshi
Sakshi News home page

సంప్రదాయాలను కాపాడుకుందాం

May 27 2017 10:38 PM | Updated on Sep 5 2017 12:09 PM

సంప్రదాయాలను కాపాడుకుందాం

సంప్రదాయాలను కాపాడుకుందాం

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హంపీ విరూపాక్షి పీఠాధిపతి స్వరూపానంద విద్యారణ్యభారతి అన్నారు.

– హంపీ పీఠాధిపతి స్వరూపానంద విద్యాభారతి
 
బండిఆత్మకూరు: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హంపీ విరూపాక్షి పీఠాధిపతి స్వరూపానంద విద్యారణ్యభారతి అన్నారు. శనివారం పెద్దదేవళాపురం గ్రామంలో ఏకశిల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష​‍్ఠను వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతి ప్రవచనాలు వినిపించారు. భారతదేశ సంప్రదాయాలను తెలుసుకొని విదేశీయులు ఆచరించి నోబెల్‌ ప్రైజ్‌ను సైతం పొందారన్నారు. తల్లిదండ్రులను ప్రతి రోజూ పూజిస్తే జ్ఞానం కలుగుతుందన్నారు. అయితే ప్రతి ఇంట్లో మమ్మి, డాడీ పిలుస్తూ అగౌరవ పరుస్తున్నామన్నారు. మమ్మి అంటే శవం అని, డాడీ అంటే గాడిద కంటే తక్కువ పదం వస్తుందన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులు రైన్‌రైన్‌ గో అవే అని పాటలు పాడుతున్నారన్నారు. దీని అర్థం వర్షం వెళ్లిపో... నని అన్నారు. దీంతో బాల వాక్కు బ్రహ్మవాక్కు అని, దీని వల్ల కూడా వర్షాలు కురియడం లేదన్నారు. వానవానా వల్లప్ప అంటే వర్షాలు వస్తాయని, మన సంప్రదాయాల విశిష్టత గురించి వివరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు తన వైట్‌హౌస్‌ను దీపావళి పండుగ రోజు దీపాలు వెలిగించి మన సాంప్రదాయాన్ని పాటిస్తేంటే.. మనదేశీయులు మాత్రం విదేశాల పాశ్చాత్య పోకడలను ఆచరిస్తున్నారన్నారు. పిల్లలు హనుమాన్‌ చాలీసా చదివితే టెన్షన్‌ తగ్గుతుందన్నారు. యజ్ఞ యాగాదులు నిర్వహించడంతో వర్షాలు కురుస్తాయన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement