breaking news
Swarupananda
-
సంప్రదాయాలను కాపాడుకుందాం
– హంపీ పీఠాధిపతి స్వరూపానంద విద్యాభారతి బండిఆత్మకూరు: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హంపీ విరూపాక్షి పీఠాధిపతి స్వరూపానంద విద్యారణ్యభారతి అన్నారు. శనివారం పెద్దదేవళాపురం గ్రామంలో ఏకశిల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతి ప్రవచనాలు వినిపించారు. భారతదేశ సంప్రదాయాలను తెలుసుకొని విదేశీయులు ఆచరించి నోబెల్ ప్రైజ్‌ను సైతం పొందారన్నారు. తల్లిదండ్రులను ప్రతి రోజూ పూజిస్తే జ్ఞానం కలుగుతుందన్నారు. అయితే ప్రతి ఇంట్లో మమ్మి, డాడీ పిలుస్తూ అగౌరవ పరుస్తున్నామన్నారు. మమ్మి అంటే శవం అని, డాడీ అంటే గాడిద కంటే తక్కువ పదం వస్తుందన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులు రైన్‌రైన్ గో అవే అని పాటలు పాడుతున్నారన్నారు. దీని అర్థం వర్షం వెళ్లిపో... నని అన్నారు. దీంతో బాల వాక్కు బ్రహ్మవాక్కు అని, దీని వల్ల కూడా వర్షాలు కురియడం లేదన్నారు. వానవానా వల్లప్ప అంటే వర్షాలు వస్తాయని, మన సంప్రదాయాల విశిష్టత గురించి వివరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు తన వైట్‌హౌస్‌ను దీపావళి పండుగ రోజు దీపాలు వెలిగించి మన సాంప్రదాయాన్ని పాటిస్తేంటే.. మనదేశీయులు మాత్రం విదేశాల పాశ్చాత్య పోకడలను ఆచరిస్తున్నారన్నారు. పిల్లలు హనుమాన్ చాలీసా చదివితే టెన్షన్ తగ్గుతుందన్నారు. యజ్ఞ యాగాదులు నిర్వహించడంతో వర్షాలు కురుస్తాయన్నారు. -
'ప్రకృతి వైపరీత్యాలకు మోడీ, బాబులే కారణం'
-
శారదా పీఠాధిపతి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ప్రమాణస్వీకార ముహూర్తాలపై శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఇద్దరూ దుర్ముహూర్తంలో ప్రమాణస్వీకారం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ రోజు స్వరూపానంద పుట్టిన రోజు. హుదూద్ తుపాను కారణంగా పుట్టినరోజు వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు. వారు ఇద్దరూ సూర్యాస్తమయం అయిన తరువాతే ప్రమాణస్వీకారం చేశారన్నారు. అవి సరైన ముహూర్తాలు కానందునే కాశ్మీర్ వరదలు, హుదూద్ తుపాను వచ్చినట్లు తెలిపారు. మరో మూడేళ్ల వరకు ప్రకృతి వైపరీత్యాలు తప్పవని ఆయన హెచ్చరించారు. రేపు గుజరాత్లో రానున్న వరదలకు కూడా ఇదే కారణం అన్నారు. రాజకీయ నాయకులపై తనకు ఎటువంటి ద్వేషాలు లేవన్నారు. ఇప్పటికైనా దేశంలో ఉన్న పీఠాధిపతులను పిలిపించి సలహాలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. స్వరూపానంద భక్తులు ఆయన మాటలను విశ్వసిస్తున్నారు. **