కైలాసాన.. కార్తీకాన శివదీపం | Sensation Of Kartheeka Deepostavam | Sakshi
Sakshi News home page

కైలాసాన.. కార్తీకాన శివదీపం

Nov 13 2016 11:16 PM | Updated on Sep 4 2017 8:01 PM

కైలాసాన.. కార్తీకాన శివదీపం

కైలాసాన.. కార్తీకాన శివదీపం

విశాఖ పట్టణానికి చెందిన కూచిపూడి కళాకేంద్రం బృందం సభ్యులు.. భండాసుర వధ నృత్య నాటకాన్ని భక్తజన రంజకంగా ప్రదర్శించారు. స్థానిక మున్సిపల్‌ మైదానంలో వారం రోజులుగా చిన్మయ మిషన్‌ కడప శాఖ గురువులు స్వామి శౌనక చైతన్య ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి.

కడప కల్చరల్‌ : విశాఖ పట్టణానికి చెందిన కూచిపూడి కళాకేంద్రం బృందం సభ్యులు.. భండాసుర వధ నృత్య నాటకాన్ని భక్తజన రంజకంగా ప్రదర్శించారు. స్థానిక మున్సిపల్‌ మైదానంలో వారం రోజులుగా చిన్మయ మిషన్‌ కడప శాఖ గురువులు స్వామి శౌనక చైతన్య ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన భక్తులు కళాకారుల నృత్య ప్రదర్శనలను పరవశంతో తిలకించారు. కళాకారులు ప్రతి పాత్రకు జీవం పోసి శివమూర్తికి నృత్య నిరాజనం అర్పించారు. నిర్వాహకులు ఎలిశెట్టి శివకుమార్, చింతకుంట పుల్లయ్య, ముల్లంగి ప్రసాద్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు. సోమవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement