రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో రెండో స్థానం | second place in state level chess | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో రెండో స్థానం

Jun 29 2017 10:04 PM | Updated on Sep 5 2017 2:46 PM

రాష్ట్రస్థాయి అండర్‌–7 చెస్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి స్ఫూర్తిరెడ్డి రెండోస్థానంలో నిలిచిందని జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవిరాజు, కోచ్‌ జాకీర్‌హుస్సేన్‌ తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : రాష్ట్రస్థాయి అండర్‌–7 చెస్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి  స్ఫూర్తిరెడ్డి రెండోస్థానంలో నిలిచిందని జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవిరాజు, కోచ్‌ జాకీర్‌హుస్సేన్‌ తెలిపారు. ఈ నెల 24 నుంచి 26 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన 31వ రాష్ట్రస్థాయి పోటీల్లో విశాఖ క్రీడాకారిణి 5.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా స్ఫూర్తిరెడ్డి  5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్‌ క్రీడాకారిణిని అభినందించారు. జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవిరాజు మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలు సెప్టెంబర్‌ మొదటి వారంలో విజయవాడలో జరుగుతాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement