కార్యాలయాల కోసం కసరత్తు | Sakshi
Sakshi News home page

కార్యాలయాల కోసం కసరత్తు

Published Sat, Sep 3 2016 7:41 PM

ధరూర్‌ క్యాంపులోని ఈఈ ఆఫీసును పరిశీలిస్తున్న కలెక్టర్‌

  • న్యాక్‌పై పునరాలోచన
  • భవనాలను పరిశీలించిన కలెక్టర్‌ నీతూప్రసాద్‌
  • జగిత్యాల అర్బన్‌ : కొత్త జిల్లాలో పరిపాలన దసరా నుంచి మొదలు కానుండడంతో ఈ దిశగా అధికారులు పనులు వేగవంతం చేశారు. జిల్లా కార్యాలయాల తాత్కాలిక ఏర్పాట్ల కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ జగిత్యాలలోని పలు భవనాలను శనివారం పరిశీలించారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంతో పాటు గెస్ట్‌హౌస్, ఎస్సారెస్పీ క్యాంపులోని కార్యాలయాలు, న్యాక్‌ భవనాన్ని సైతం పరిశీలించారు. భవనాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యాక్‌ కేంద్రాన్ని తాత్కాలిక కలెక్టరేట్‌ కోసం ఇప్పటికే ప్రతిపాదించారు. అయితే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు పలువురు న్యాక్‌ భవనం దూరమవుతుందని, రోడ్డు సైతం బాగా లేదని, గుట్టలు, చెట్లపొదల మధ్య ప్రజల వెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని అభ్యంతరం తెలిపారు. దీంతో కలెక్టర్‌ మరోసారి భవనాలను పరిశీలించారు. న్యాక్‌ భవనం కాకుండా కలెక్టరేట్‌కు ప్రత్యామ్నాయ భవనం ఎక్కడ ఉందని ఆరా తీశారు. ఎస్సారెస్పీ క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని తెలిపారు. ఇవి కలెక్టర్‌ కార్యాలయానికి అనుకూలంగా లేవని తెలిపారు. కలెక్టర్‌ వెంట సబ్‌కలెక్టర్‌ శశాంక, డీఎస్పీ రాజేంద్రప్రసాద్, తహసీల్దార్‌ మధుసూదన్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. 

Advertisement
Advertisement