శిల్పసంపద అద్భుతం | Sculpture miracle | Sakshi
Sakshi News home page

శిల్పసంపద అద్భుతం

Aug 25 2016 1:03 AM | Updated on Sep 4 2017 10:43 AM

శిల్పసంపద అద్భుతం

శిల్పసంపద అద్భుతం

గణపేశ్వరాలయ శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని ఫ్రాన్స్‌కు చెందిన మార్టిమ్‌ విలియమ్‌ అన్నారు. బుధవారం ఆమె ఆలయాన్ని సందర్శించారు. జిల్లాలో పలు చోట్ల కాకతీయుల కట్టడాలను చూశానని, 21 రోజుల పాటు తెలంగాణలో తిరిగి పలు ప్రాచీన దేవాలయాలను సందర్శిస్తున్నామని తెలిపారు.

గణపురం : గణపేశ్వరాలయ శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని ఫ్రాన్స్‌కు చెందిన మార్టిమ్‌ విలియమ్‌ అన్నారు. బుధవారం ఆమె ఆలయాన్ని సందర్శించారు. జిల్లాలో పలు చోట్ల కాకతీయుల కట్టడాలను చూశానని, 21 రోజుల పాటు తెలంగాణలో తిరిగి పలు ప్రాచీన దేవాలయాలను  సందర్శిస్తున్నామని తెలిపారు. అన్ని దేవాలయాల్లోనూ అపురూపమైన శిల్పసంపద ఉందని, ఇవి ధ్వంసం కాకుండా చూడాలని అన్నారు. వరంగల్‌లోని కట్టడాలు, రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించినట్లు తెలిపారు. అనంతరం గణపేశ్వరునికి పూజలు నిర్వహించారు.  

Advertisement
 
Advertisement
Advertisement