బడుల మూసివేతను విరమించుకోవాలి | Schools shutdown govt can be avoided | Sakshi
Sakshi News home page

బడుల మూసివేతను విరమించుకోవాలి

Jul 24 2016 12:09 AM | Updated on Jul 11 2019 5:12 PM

ప్రభుత్వ బడుల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్‌ యూ.అశోక్‌ డిమాండ్‌ చేశారు. పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా కమిటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలలను శనివారం సందర్శించారు. లక్ష్మీపురం తండా, చెన్నకిష్టాపురం తదితర పాఠశాలలను సందర్శించిన వారు స్థానికులతో మాట్లాడి వివ రాలు సేకరించారు.

మహబూబాబాద్‌ రూరల్‌ : ప్రభుత్వ బడుల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్‌ యూ.అశోక్‌ డిమాండ్‌ చేశారు. పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా కమిటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలలను శనివారం సందర్శించారు. లక్ష్మీపురం తండా, చెన్నకిష్టాపురం తదితర పాఠశాలలను సందర్శించిన వారు స్థానికులతో మాట్లాడి వివ రాలు సేకరించారు.
 
అనంతరం అశోక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేరని, తక్కువ మంది ఉన్న పాఠశాలలను మూ సివేయటానికి ప్రభుత్వం యత్నిస్తోందని ఆ రోపించారు. కమిటీ బాధ్యులు ఎస్‌.గోవర్ధన్‌ మాట్లాడుతూ  విద్యార్థుల సంఖ్య పెరగాలంటే ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య ప్రవేశపెట్టాలన్నారు.   టీపీటీఎఫ్‌ మండల అధ్యక్షుడు బలాష్టి రమేష్, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి చింతకుంట్ల యాకాంబ్రం, అనిల్, పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి పి.ము రళితో పాటు ఎ.శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement