మండలంలోని నాయిరాలవలస ప్రాథమికోన్నత పాఠశాల, జాడాపేట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి వస్తువులు దొంగిలించుకుపోయారని ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు, పాఠశాలల హెచ్‌ఎంలు డి.మల్లేశ్వరరావు, తిరుపతిరావు ఎంపీడీఓకు శనివారం ఫిర్యాదు చేశారు.
పాఠశాలల్లో దొంగతనం
Aug 27 2016 11:18 PM | Updated on Sep 15 2018 4:12 PM
రేగిడి : మండలంలోని నాయిరాలవలస ప్రాథమికోన్నత పాఠశాల, జాడాపేట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి వస్తువులు దొంగిలించుకుపోయారని ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు, పాఠశాలల హెచ్‌ఎంలు డి.మల్లేశ్వరరావు, తిరుపతిరావు ఎంపీడీఓకు శనివారం ఫిర్యాదు చేశారు.
అర్ధరాత్రి సమయంలో ఆటోపై వచ్చి నాయిరాలవలస యూపీ పాఠశాలకు సంబంధించి 5 బస్తాల బియ్యం, ఫ్యాను, ఒక టీవీ అపహరించుకుపోయారని తిరుపతిరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. జాడాపేట ప్రాథమిక పాఠశాలలో 152.800 కేజీల బియ్యం అపహరించుకుపోయారని హెచ్‌ఎం మల్లేశ్వరరావు ఎంఈవోకు తెలియజేశారు. శనివారం ఉదయాన్ని గ్రామస్తులు హెచ్‌ఎంలకు సమాచారం అందించారని, పాఠశాలకు వెళ్లి చూసేసరికి తాళాలు బద్దలు కొట్టి దొంగలు ప్రవేశించారని హెచ్‌ఎంలు తెలియజేశారు. దీంతో ఎంపీడీవో దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడంతో స్థానిక పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవో పేర్కొన్నారు.
Advertisement
Advertisement