లారీని ఢీకొన్న స్కార్పియో: ఇద్దరి మృతి | Scarpio rammed lorry from back side, 2 died | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న స్కార్పియో: ఇద్దరి మృతి

Jul 18 2016 8:19 AM | Updated on Apr 3 2019 7:53 PM

వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న సంఘటనలో..

దొరవారిసత్రం: వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న సంఘటన నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం కలగుంట సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తెనాలికి చెందిన డా.ఆదిశేషారావు కుటుంబ సభ్యులతో కలిసి స్కార్పియో వాహనంలో తమిళనాడుకు వెళ్తుండగా.. కలగుంట సమీపంలో స్కార్పియో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆదిశేషారావు(45) తోపాటు డ్రైవర్ నరేష్(30) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement