సమస్యలపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పోరాటాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారు, ట్రాన్స్‌కో ఏడీఈ ఎం. శివకుమార్ పిలుపునిచ్చారు.
సమస్యలపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పోరాటం
Nov 12 2016 10:39 PM | Updated on Oct 2 2018 6:46 PM
కర్నూలు(రాజ్‌విహార్): సమస్యలపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పోరాటాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారు, ట్రాన్స్‌కో ఏడీఈ ఎం. శివకుమార్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సీ.క్యాంప్ సెంటర్ వద్ద ఉన్న ఆర్‌ఆర్ అకాడమీలో ఆ సంఘం జిల్లా కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారులతోపాటు కింది స్థాయి సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వీటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ ప్రవీణ్‌కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా జి. రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఎం. సునీల్‌కుమార్, కోశాధికారిగా అర్జున్ నాయక్‌ను ఎన్నుకున్నారు. మరో 22మందికి కమిటీలో స్థానం కల్పించారు.
Advertisement
Advertisement