దూల్మిట్ట సర్పంచ్‌ భర్త అరెస్ట్‌ | sarpanch husband arrested in atracities case | Sakshi
Sakshi News home page

దూల్మిట్ట సర్పంచ్‌ భర్త అరెస్ట్‌

Apr 24 2017 11:15 PM | Updated on Apr 3 2019 8:28 PM

మండలంలోని దూల్మిట్ట గ్రామ సర్పంచ్‌ భర్త నాచగోని లక్ష్మణ్‌గౌడ్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సోమవారం మద్దూరు పోలీసులు అరెస్ట్‌ చేశారని

మద్దూరు (హుస్నాబాద్‌): మండలంలోని దూల్మిట్ట గ్రామ సర్పంచ్‌ భర్త నాచగోని లక్ష్మణ్‌గౌడ్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సోమవారం మద్దూరు పోలీసులు అరెస్ట్‌ చేశారని గజ్వేల్‌ ఏసీపీ గిరిధర్‌ తెలిపారు.

దూల్మిట్ట గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై నవంబర్‌ 19న విచారణ అనంతరం సర్పంచ్‌ భర్త నాచగోని లక్ష్మణ్‌ గౌడ్, కుమారుడు వెంకట్‌గౌడ్‌లు కులం పేరుతో దూషించారని అదే గ్రామానికి చెందిన మెర్గు రమేష్‌ చేసిన ఫిర్యాదు మేరకు నవంబర్‌ 20న కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నాచగోని లక్ష్మణ్‌ గౌడ్‌ను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement