’సాక్షి ’మ్యాథ్స్ బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన | 'sakshi' Maths semi-final to be widespread | Sakshi
Sakshi News home page

’సాక్షి ’మ్యాథ్స్ బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన

Dec 5 2016 10:34 PM | Updated on Sep 4 2017 9:59 PM

’సాక్షి ’మ్యాథ్స్ బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన

’సాక్షి ’మ్యాథ్స్ బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన

’సాక్షి’ మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న సాక్షి మ్యాథ్స్ బీ-2016, పరీక్షకు విశేష స్పందన లభించింది.

►  శ్రీ ప్రకాష్ స్కూల్‌లో ఉత్సాహంగా సెమీఫైనల్స్
►  235 మంది విద్యార్థులు హాజరు

విశాఖపట్నం: ’సాక్షి’ మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న సాక్షి మ్యాథ్స్ బీ-2016, పరీక్షకు విశేష స్పందన లభించింది.  వివిశాఖపట్నంలోని ఆశీలమెట్ట  శ్రీ ప్రకాష్ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన సెమీఫైనల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరీక్ష  ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్ష ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి నాలుగు కేటగిరీల్లో 235 మంది విద్యార్ధులు పరీక్షలకు హజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు హైదరాబాద్‌లో జరిగే ఫైనల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. 

కేటగిరీ-1లో 1,2 వ తరగతులు, కేటగిరీ -2లో 3, 4వ తరగతులు, కేటగిరీ -3లో, 5, 6, 7వ తరగతులు, కేటగిరి-4లో 8, 9. 10 వ తరగతుల విద్యార్థులు పోటీ పడ్డారు. పరీక్ష ద్వారా తమలో ఉత్సాహం ఇనుమడించిందని చాలా మంది విద్యార్థులు చెప్పారు. కొత్త విషయాలు తెలుసుకునే ఆసక్తి పరీక్ష ద్వారా ఇనుమడించిందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement