వెయిట్ లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించిన తెనాలి వాసి ఘట్టమనేని సాయిరేవతి తాజాగా మహిళల రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు.
సాయిరేవతికి రెండు స్వర్ణాలు
Jul 20 2016 8:24 PM | Updated on Sep 4 2017 5:29 AM
తెనాలి: వెయిట్ లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించిన తెనాలి వాసి ఘట్టమనేని సాయిరేవతి తాజాగా మహిళల రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఈ నెల 16, 17 తేదీల్లో నందిగామలో పోటీలు నిర్వహించింది. 63 కిలోల కేటగిరీలో పోటీల్లో పాల్గొన్న సాయిరేవతి, ఎక్కిప్డ్ విభాగంలో 402.5 కిలోల బరువులనెత్తి ప్రథమస్థానంలో నిలిచారు ‘అన్‌ఎక్విప్డ్’లోనూ 357.5 కిలోలతో విజేతగా నిలిచి, రెండు విభాగాల్లోనూ బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ఆదాయ పన్నుల శాఖలో ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు ఆదాయ పలువురు అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement