
ఐస్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత స్ట్రాంగ్‌మాన్ హాఫ్థోర్ బ్జోర్న్‌సన్ (Hafthor Bjornsson) మానవ శక్తికి కొత్త నిర్వచనం చెప్పాడు. బర్మింగ్హమ్‌లో జరిగిన 2025 వరల్డ్ డెడ్‌లిఫ్ట్ ఛాంపియన్షిప్‌లో ఊహకందని విధంగా 510 కిలో బరువు (1,124.4 పౌండ్లు) ఎత్తాడు. ఈ క్రమంలో తన పేరిటే ఉండిన ప్రపంచ రికార్డును (505 కిలోలు) తిరగరాశాడు.
బ్జోర్న్‌సన్ 500 కిలోలకు పైగా డెడ్‌లిఫ్ట్ చేయడం ఇది మూడోసారి. 2020లో 501 కిలోలు, 2025 జులై 505 కిలోల బరువులు ఎత్తాడు. తాజా ఉదంతంతో బ్జోర్న్‌సన్ మానవ శక్తి సామర్థ్యానికి కొత్త ప్రమాణాన్ని స్థాపించాడు. అతని శ్రమ, పట్టుదల, శరీర సామర్థ్యం ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నాయి.
510kg / 1124lbs DEADLIFT WORLD RECORD pic.twitter.com/WMKUqQvvzr
— Hafþór J Björnsson (@ThorBjornsson_) September 6, 2025
2018లో వరల్డ్ స్ట్రాంగ్‌మాన్‌గా అవతరించిన బ్జోర్న్‌సన్.. ఆతర్వాత Arnold Strongman Classic, Europe’s Strongest Man పోటీలు గెలిచి, ఒకే సంవత్సరంలో ఈ ఘనతలు సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్రకెక్కాడు. 36 ఏళ్ల బ్జోర్న్‌సన్ తన కెరీర్‌లో 129కి పైగా ప్రపంచ రికార్డులు, 32 అంతర్జాతీయ టైటిళ్లు సాధించాడు. బ్జోర్న్‌సన్ Game of Thrones సినిమాలో “The Mountain” పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.