సరికొత్త క్రీడా స్ఫూర్తిని నింపింది ఈ తల్లి. తన గెలుపుతో సరికొత్త అధ్యయానికి తెరతీసిందామె. గర్భంతో ఉన్నవాళ్లు చిన్న చిన్న బరువులు ఎత్తేందుకే భయపడతారు. అలాంటిది వెయిల్‌లిఫ్టింగ్‌లో పాల్గొనడమే కాదు విజయం సాధించింది ఈ మహిళ. స్థిరత్వం, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అడ్డంకినైనా అధిగమించొచ్చని నిరూపించింది ఈ తల్లి.
ఏడు నెలల నిండు గర్భిణి అయిన సోనికా యాదవ్(Sonika Yadav) ఈ ఘనత సృష్టించింది. ఆమె ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్(Delhi Police constable)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26(Weightlifting Cluster 2025-26 )లో పాల్గొని 145 కిలోల బరువుని ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ఆమె గత మే నెలలో గర్భం దాల్చినట్లు నిర్థారణ అయ్యాక..శిక్షణ నిలిపేస్తుందని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే ఆమెకు క్రీడలు, ఫిట్‌నెస్ పట్ల ఉన్న మక్కువతో కొనసాగించాలనే నిర్ణయించుకుంది. చాలా దృఢసంకల్పంతో నిపుణుల పర్యవేక్షణలో తన వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్‌ని తీసుకున్నట్లు పేర్కొంది.
నిజానికి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఎవ్వరికీ ఆమె గర్భిణి అని తెలియదు. ఎందుకంటే సోనియా వదులుగా ఉన్న దుస్తులే ధరించి సహ పోటీదారులతో పాల్గొంది. చివరి డెడ్‌లిఫ్ట్ ప్రయత్నంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా ఆమె క్రీడాస్ఫూర్తిని చూసి ఒక్కసారిగా ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులతో చప్పట్లుతో అభినందనలు వెల్లువెత్తాయి. ఆ అసాధారణ గెలుపుని చూసిన వివిధ పోలీసు విభాగాల మహిళా అధికారులంతా సోనికాని అభినందనలు, ప్రశంసలతో ముంచెత్తారు.
ఇక సోనికా గర్భవతిగా ఉండగా ఇలాంటి పోటీల్లో పాల్గొన్న అంతర్జాతీయ లిఫ్టర్ లూసీ మార్టిన్స్ నుంచి ప్రేరణ పొందినట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, 2014 బ్యాచ్ అధికారిణి అయిన సోనికా ప్రస్తుతం కమ్యూనిటీ పోలీసింగ్ సెల్‌లో పనిచేస్తున్నారు. గతంలో, మజ్ను కా తిలా ప్రాంతంలో బీట్ ఆఫీసర్‌గా, అలాగే మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచారాల్లోనూ కీలక పాత్ర పోషించారామె.
ప్రెగ్నెంట్ టైంలో మంచిదేనా..!
గర్భవతిగా ఉన్నప్పుడూ వెయిట్‌లిఫ్టింగ్ సురక్షితమేనని చెబుతున్నారు నిపుణులు. ప్రెగ్నెంట్ టైంలో వచ్చే వెన్నునొప్పి, వంటి సమస్యలు ఉండవని తేలికగా ఉంటుందని చెబుతున్నారు. దీని వల్ల మీ కోర్ కండరాలు బలోపేతమై..నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువుగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు.
కానీ వైద్యుడు సమక్షంలో లేదా పర్యవేక్షణలో చేయాలని సూచిస్తున్నారు. వారి సలహాలు సూచనలతో తగిన జాగ్రత్తలతో బరువులు ఎత్తితే బిడ్డకు తల్లికి ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఇక్కడ బరువు ఎత్తేటప్పుడూ.. ఫిట్‌నెనస్ ట్రైనర్‌ల సూచనలమేరకు తేలికపాటి టెక్నిక్‌లతో ఎత్తాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
🏋️♀️Defying limits, redefining strength💪
W/Ct. Sonika of @DcpNorthDelhi clinched Bronze medal at the All India Police Weightlifting Cluster 2025-26, Amravati (A.P.), lifting a total of 350 kg in 84+ kg category — while 7 months pregnant!
True embodiment of strength, courage &… pic.twitter.com/F9jqYdXAFB— Delhi Police (@DelhiPolice) October 24, 2025
(చదవండి: Shreyas Iyer: పక్కటెముక గాయం అంటే..? వామ్మో.. మరీ అంత డేంజరా?)


